గత కొన్నాళ్లుగా తెలంగాణ మీడియా మొత్తం అల్లు అర్జున్ వివాదంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు స్పష్టమౌతోంది. ఇక పుష్ప సినిమా విడుదల నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన కారణంగా ఈ వివాదం చెలరేగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రంమలోనే సీఎం రేవంత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విషయం ఏమిటంటే... కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అల్లు అర్జున్ పైన వరుసగా దాడి చేస్తున్న నేపథ్యంలో రేవంత్ యూ టర్న్ తీసుకున్నారు. ఈ ఎపిసోడ్‌పై నేతలు ఎవరూ మాట్లాడవద్దని, చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతోంది కాబట్టి ఇంకా విమర్శలు ఆపాలని సూచనలు చేసారు.

ఇకపోతే, అల్లు అర్జున్ ఎపిసోడ్‌ రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతుండడం గమనార్హం. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని మీడియా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇక జరుగుతున్న వ్యవహారాలను సీఎం రేవంత్‌రెడ్డి అయితే చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. పోలీసులు, నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడంతోనే రేవంత్ తాజాగా ప్రకటన చేయడం జరిగింది. ఇక ఈ విషయంపై ఇండస్ట్రీ సైలెంట్ కావడంతో.. నేతలు సైతం నోరు ఎత్తకుండా ఉంటేనే బెటరని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీసీ మహేష్‌కుమార్ గౌడ్‌కు కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా సమావేశాలు, చర్చలకు అందరూ దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా పార్టీ నాయకులు అయితే మాట్లాడకుండా చూడాలని పీసీసీని ఆదేశించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావిస్తూ... ఇకపై ప్రత్యేక షోలు, టికెట్ల పెంపు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండగా జరగదని చాలా ఖరాఖండిగా చెప్పేశారు. అదే రోజు సాయంత్రం నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెప్పుకురాగా... పోలీసులు.. మంత్రులు, నేతలు కౌంటర్ ఎటాక్ ఇస్తూ అల్లు అర్జున్‌ను దుమ్మెత్తిపోశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: