జనవరిలో సాధారణంగా సంక్రాంతి పండుగ 13,14,15 తేదీలలో మాత్రమే వస్తూ ఉంటాయి.అయితే వీటికి ముందు కనీసం నాలుగైదు రోజులైనా సెలవులు ఇచ్చేవారు. మొత్తం మీద సుమారుగా 10 రోజులకు పైగా సెలవులు వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా పదవ తరగతి విద్యార్థులకు కేవలం 13, 14, 15 తేదీలలోనే సెలవులు ఉంటాయట. మిగిలిన రోజులలో క్లాసులు తీసుకోబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. పదవ తరగతి మెయిన్ పరీక్షల షెడ్యూల్ మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు పబ్లిక్ జరగబోతున్న సమయంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పరీక్షలు రోజు విడిచి రోజు నిర్వహించడంతో విద్యార్థులకు మంచి అవకాశం ఉంటుందని.. విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ అయ్యేందుకు సమయం ఉంటుందని తెలియజేశారు.
అయితే సంక్రాంతి సెలవులు తగ్గించడంతో అటు విద్యార్థులు తల్లితండ్రులు సైతం కాస్తాం తృప్తితో ఉన్నారట. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలియజేశారు మంత్రి నారా లోకేష్.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ షెడ్యూల్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు మొదటి సంవత్సరం పరీక్షలని మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరగబోతున్నాయట. వీరి ఎగ్జామ్లు కూడా రోజు విడిచి రోజు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట ఏపీ ప్రభుత్వం.