ఉక్రెయిన్ ఆ వీడియోని షేర్ చేస్తూ... రష్యాలోని కుర్క్స్ సరిహద్దుల్లో ఎగరేసిన డ్రోన్ రికార్డు చేసిన ఫుటేజీ అని పోస్టులో రాసుకొచ్చింది. కాగా పుతిన్ తో ఉన్న స్నేహ బంధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న తన సైనికులను యుద్ధానికి పంపించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రష్యా తరఫున కిమ్ సైనికులు ఉక్రెయిన్ సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. కిమ్ సైనికులను రష్యా అధికారులు కుర్క్స్ సరిహద్దుల్లో మోహరించారు. ఉక్రెయిన్ చొరబాటును అడ్డుకోవడానికి 3 గ్రామాల్లో ఏకంగా పదివేల మందికి పైగా సైన్యాన్ని దింపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే... స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం ఒకవైపు, మరోవైపు భాష తెలియకపోవడం వంటి సమస్యలు అనేవి కిమ్ సైనికులకు అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. ఇక దీనిని సావకాశంగా మలుచుకున్న ఉక్రెయిన్ బలగాలు.. కమికేజ్ డ్రోన్లతో కిమ్ సైనికులను వేటాడి, వేధించి కుక్కల్ని చంపినట్టు చంపుతున్నాయని అంతర్జాతీయ మీడియాలు కధలు కధలుగా కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన వీడియోలో.. సైనికులను తరుముతూ డ్రోన్ కాల్పులు జరపడం అయితే చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒక్కో సైనికుడిని మట్టుబెట్టుకుంటూ డ్రోన్ ముందుకు సాగడం సదరు వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు. కాగా సదరు వీడియోని చూసిన కిమ్ అనుచరులు, ఇతర సైనికులు గుండెల్లో గుబులు బయలుదేరినట్టు సమాచారం. అనవసరంగా రష్యాతో పొత్తు పెట్టుకున్నామా అని కిమ్ ఫీల్ అవుతున్నట్టు సమాచారం.