ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ అరెస్టు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. దీంతో... ఈ వివాదం అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. కొన్ని ప్రెస్ మీట్ లలో రేవంత్ రెడ్డికి నచ్చని విధంగా అల్లు అర్జున్ మాట్లాడాడని.... ఈ నేపథ్యంలోనే అతని అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో... అల్లు అర్జున్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


 
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆంధ్రుడు అంటూ... రెచ్చిపోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. తాజాగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి... అల్లు అర్జున్ అంశం పైన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రుడు అంటూ అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై... కక్షగట్టి మాట్లాడుతున్నాడని... అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు భూపతిరెడ్డి.

 
ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... తెలంగాణలో అల్లు అర్జున్ సినిమాలు అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. లేకపోతే అల్లు అర్జున్ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ రెచ్చిపోతున్నారని అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు.

 
ఇది ఇలా ఉండగా ఇవాళ పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. మొన్న ప్రెస్ మీట్ లో పోలీసులపై అలాగే తెలంగాణ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీంతో ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ ఎదుర్కొన్నారు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: