ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మధ్య గత కొద్ది రోజులుగా ఆస్తి వివాదాలు తలెత్తయన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా జగన్ చెల్లెలి షర్మిలతో మొదలైన గొడవ చివరికి.. తల్లి విజయమ్మతో కూడా మాట్లాడలేదని వార్తలు వినిపించాయి. అలా షర్మిల, విజయమ్మ ఇద్దరు కూడా ఒకే వైపు ఉన్నారని వార్తలు కూడా గతంలో వినిపించగా.. ఈ విషయాన్ని  చెక్ పెట్టే విధంగా విజయమ్మ ఇటివలె తన కొడుకుతో  కలిసిపోయి మరి కనిపించినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.


ఇటీవల జగన్ నాలుగు రోజులపాటు తన పర్యటనను సొంత జిల్లా కడపలో చేయబోతున్నారు. ఆయన ఇటీవలే పులివెందులలోనే ఇడుపులపాయకు చేరుకున్నప్పటికీ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరిగింది. అక్కడ తన తల్లి విజయమ్మ కూడా రావడంతో.. విజయమ్మతో  కలిసి మరి ముచ్చటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇద్దరు కూడా కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకున్నట్లుగా సమాచారం. అలాగే క్రిస్మస్ వేడుకల సందర్భంగా తల్లి కొడుకులు కలిసిపోయారని విషయం అభిమానులకు తెలియగానే వైసిపి నేతలు, కార్యకర్తలు సైతం కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.


అటు వైఎస్ విజయమ్మ, కుమారుడు  జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి ఇలా అందరూ కలిసి ఒకే చోట కనిపించడం జరిగిందట. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గతంలో కూడా విజయమ్మ ఒక సంచలన లేఖ రాస్తూ వైయస్ జగన్ షర్మిల ఇద్దరు కూడా తన బిడ్డలే అని వారిద్దరూ తనకు రెండు కళ్ళు లాంటివారు అంటూ తెలియజేసింది. మరి కొంతమంది వైసిపి అభిమానులు రాబోయే రోజుల్లో షర్మిల , జగన్, విజయమ్మ, భారతి ఇలా అందరూ కూడా కలిసిపోతారని కచ్చితంగా అలాంటి రోజు ఒకటి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే యేడాది నుంచి జనం మధ్యలోకి జగన్ రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: