ఇక్కడ మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ..APPCC అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నది. ఆ తర్వాత తన అన్నని లక్ష్యంగా చేసుకొని తన అన్న పైన పూర్తిస్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది షర్మిల. అటు చంద్రబాబు కి సపోర్ట్ చేస్తూ తన అన్నను ఓడించాలని ప్రయత్నాలు చేసి ఓడించడం జరిగింది. ఇక షర్మిల వ్యక్తిగత విభేదాల దృష్టి తన అన్నను రాజకీయంగా టార్గెట్ చేయడమే ఇప్పటికే కూడా ఆమె విమర్శలు చేస్తూనే ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పదవి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో పుంజుకునేలా చేయలేదు. దీని కారణంగానే ఈమె పైన చాలామంది పెదవి విరుస్తున్నారు.
కేవలం షర్మిల వ్యక్తిగత విషయాలకు సంబంధించి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని మార్చుకున్నదని సీనియర్ నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం సీనియర్ నాయకులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సీనియర్ నేతలు కూడా ఈమెను తప్పుపడుతూ ఈ విషయాలను హై కమాండ్ కి తీసుకువెళ్లారట. అంతేకాకుండా షర్మిల చేస్తున్న కొన్ని పనులను కూడా హై కమాన్ దృష్టిలో పెట్టుకొని ఆమెకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. షర్మిల రాజకీయాలలో కొనసాగడం కంటే రిటైర్మెంట్ ప్రకటిస్తేనే మంచిదంటు చాలామంది నేతలు కూడా తెలియజేస్తున్నారట.ఇప్పటికే చాలామంది నేతలను కూడా వైసిపి పార్టీలోకి సీనియర్ నేతలు వెళ్లడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.