పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ మీద ఏదో ఒక విషయంపై రూమర్ వినిపిస్తూనే ఉంది.. ముఖ్యంగా పుష్ప 2  సమయంలో సంధ్య థియేటర్ కు వెళ్లగా అక్కడ తొక్కిసలాట జరగడంతో  రేవతి మరణించగా ఆమె కుమారుడు ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు..ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లడం వల్ల ఈ సంఘటన జరిగిందని తెలంగాణ ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ కావడంతో వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసిందే..


అయితే అల్లు అర్జున్ కుటుంబం మీద దాడి ఇటీవలే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా చేశారు. ముఖ్యంగా రేవతి కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదని నానా హంగామా చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలే అల్లు అర్జున్ విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్నది.. అయితే ఇటీవలే కొన్ని గంటల క్రితం అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత చిత్ర బృంద రెండు కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ప్రకటించింది అంటు తెలిపారు..


ముఖ్యంగా అల్లు అర్జున్ కోటి రూపాయలు అని డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు అని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు 50 లక్షలు ఇస్తున్నట్లుగా తెలియజేశారు. అందుకు  సంబంధించిన చెక్కును సైతం అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత,FDC చైర్మన్ గా పేరు పొందిన దిల్ రాజు కు చెక్కు అందించబోతున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడికి సైతం అల్లు అరవింద్ శ్రీ తేజ్ ను పరామర్శించడం కూడా జరిగిందట. ఇటీవలే అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: