2024 సంవత్సరం వైసీపీ అధినేత జగన్ కు ఎంతగానో గుర్తుండిపోతుంది. ఎందుకంటే వైసీపీకి ఈ ఏడాది వచ్చిన ఫలితాలు ఎంతో నిరాశపరిచాయి.. ఓటమి కాదు... ఘోర ఓటమి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ పరువు గంగలో కలిసినట్లుయింది.. అంతలా వైసీపీ ఘోర ఓటమి పాలైంది... 2009లో కడప ఎంపీగా రాజకీయ అరంగేట్రం చేసిన జగన్.కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ ఏడాది తండ్రి అకాల మరణం చెందడంతో ఆయన సీఎం పదవి ఆశించారు.కాంగ్రెస్ హై కమాండ్ అందుకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి  బయటకు వచ్చారు.వైసీపీ అనే సొంత పార్టీ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ పై వున్న క్రేజ్ తో 2012 ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలు అలాగే 2019లో ఏకంగా 151 స్థానాలు గెలుపొంది జగన్ చరిత్ర సృష్టించారు.. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది...గతంలో తాను జైలులో వున్నా కానీ పార్టీ ఎంతో బలంగా ముందడుగు వేసింది.. 

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. కూటమి ఎంతో బలంగా వుంది.. వైసీపీకి ప్రశ్నించే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు.. అది గాక వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలన్నీ బయటకు తీస్తుంది..నేరం రుజువైతే వెంటనే జైలులో పడేస్తుంది.. దీనితో వైసీపీ నాయకులు వణికిపోతున్నారు.. జగన్ హయాంలో నోరేసుకొని పడిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.. జగన్ సైతం కూటమి అధికారాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు.. కూటమి వచ్చి 6 నెలలు గడించింది.. ఈ 6 నెలల్లో జరిగిన అసెంబ్లీ సమావేశలన్ని జగన్ లేకుండానే జరిగాయి.. జగన్ అసెంబ్లీకి రాకపోవడం ఆ పార్టికి పెద్ద మైనస్.. ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అందుకే రావట్లేదని జగన్ సర్దిచెప్పుకుంటున్నారు.. అయితే అసెంబ్లీకి వెళ్ళని రాజకీయ నాయకుడిని సమాజం చేతకానీ నాయకుడిగా చూస్తుంది.. ఈ  ఐదేళ్లు జగన్ ఇలానే చేస్తే ఆ పార్టీకి తీవ్ర నష్టం తప్పదు.. ఈ ఏడాది ప్లాప్ అయిన వైసీపీ వచ్చే ఏడాది అయిన గేమ్ ఛేంజర్ అవుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: