హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దూరం తగ్గేలా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు ఏలూరు జిల్లా రైతులకు తలనొప్పిగా మారాయి. పరిహారం విషయంలో ఇప్పటికే అనేకసార్లు రోడ్డు ఎక్కిన రైతులు ఇప్పుడు మిగిలిన పంట పొలాలను ముంపు నుంచి కాపాడుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో పొలాలకు వెళ్లే దారి కోసం పోరాడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమయ్యే గ్రీన్ ఫీల్డ్ హైవే దేవరపల్లి మీదుగా రాజమహేంద్రవరం వరకు వెళుతుంది.


162 కిలోమీటర్ల ఈ రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాదు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు విజయవాడ నుంచి వెళుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా మీదుగా ఈ జాతీయ రహదారి వెళుతోంది. జిల్లాలోని జంగారెడ్డిగూడెం టీ నర్సాపురం మండలాల్లో పలు గ్రామాల మీదుగా వెళ్లే రహదారి కోసం బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే భూములు సేకరించారు. దీనిపై అప్పట్లో రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు రైతులకు కొత్త కష్టాలు వస్తున్నాయి.





భారీ వర్షాల సమయంలో పక్కనే ఉన్న చెరువులు పొంగి నీళ్లు కిందికి వెళ్ళేవి. ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ రహదారి అడ్డుగా ఉండడంతో ఆ నీరంతా పంట పొలాలను ముంచేత్తుతోంది. రహదారి కింద తర్వాత చాలామంది రైతులకు చెందిన పొలాలు రెండు ముక్కలుగా మారాయి. రైతులకు వ్యవసాయ పనులు చేసుకోవడం తలనొప్పిగా మారింది. ఆయకట్టులో చివర రైతు అవతలి వైపు వెళ్లాలంటే అండర్ పాస్ నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది .. పలువురు రైతులకు వ్యవసాయ బోర్లు రహదారికి ఒకవైపు ఉంటే మరోవైపు ఉన్న పొలానికి నీరు మళ్ళించడం కూడా కష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: