టిడిపి పార్టీలో సీనియర్ నేతగా, నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఈడీ అధికారులు జలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈయన బ్యాంకును మోసం చేసిన కేసులు సుమారు రూ.48 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను ఈడి అధికారులు జప్తు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. రాయపాటికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ TIL  కు సంబంధించి బ్యాంకు నుంచి అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకుండా ఉండడంతో ఈడీ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందట. ఇందులో భాగంగా ఈయన ఆస్తులలో జప్తు చేసిన విషయానికి వస్తే వ్యవసాయ, నివాస స్థలాలు కూడా ఉన్నాయట.



బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నటువంటి మొత్తం డబ్బులలో 85.90 కోట్ల రూపాయలను డైరెక్టర్లు ప్రమోటర్లు తమ సొంత ఖాతాలోకి సైతం డబ్బులను  మళ్లించుకున్నట్లుగా అభియోగాలు నవోదయ్యాయట.. దీంతో ఈయన కంపెనీలలో ఉండేటువంటి షెల్ కంపెనీలు అక్రమ నగదు బదిలీని చేశారంటూ బ్యాంకు అధికారులకు సైతం ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా వీరిపైన ఈడీ కేసు నమోదు అయిందట. ట్రాన్స్ స్ట్రామ్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వినియోగించుకున్న ప్రయోజనాలను సైతం చూపించలేకపోయారని ఈడి అధికారులు తెలుపుతున్నారు.


ఈ కంపెనీలో నిరంతరం అక్రమాలు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ తరచుగా జరుగుతూ ఉన్నాయట.. అలాగే ఇంట్రెస్ట్ ని చెల్లించకపోవడం ఇతరత్రా వంటి పనులు చేస్తున్నారట. రుణం తీసుకున్న కంపెనీలు వాటి గ్రూపులు, షెల్ ఎంటిటీలు, డైరెక్టర్లు యాజమాన్యం, ప్రమోటర్లు నియంత్రణలో ఉండేటువంటి ఎన్నో కంపెనీలకు వీటిని మళ్ళించారని ఈడి అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ టర్నోవర్స్ చూపించడం వల్ల ఎప్పటికప్పుడు క్రెడిట్ సౌకర్యాలను కూడా పొందినట్లుగా అధికారులు దర్యాప్తులో తేల్చడం జరిగిందట. ఎల్సీల నుంచి నిధులు మోసపూరితంగానే దారులు మళ్ళించారనే విధంగా ఇది అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి  వాటి నుంచి టిడిపి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎలా బయటపడతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: