తెలంగాణ ఉద్యమకారుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత పది సంవత్సరాలుగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏది పట్టిన బంగారమే అన్నట్లుగా... కొనసాగుతోంది. ఆయన ఓటమి ఎరగని నాయకుడిగా ఎదిగారు. 1983 తర్వాత అసలు కెసిఆర్ ఓటమి ఎరుగని నాయకుడిగా ఎదిగారు. కానీ అలాంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు.. 2023 చివర్లో తొలి ఓటమి ఎదురైంది.

 
అసెంబ్లీ ఎన్నికల తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కెసిఆర్ ఓడిపోయారు.  ఇక అక్కడి నుంచి 2024 సంవత్సరం... కెసిఆర్ కు అసలు కలిసి రాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.... కెసిఆర్ అసలు ఈ సంవత్సరం బయట ఇక్కడ కనిపించలేదు. 2024 సంవత్సరంలో... పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో... బస్సులో వెళ్లి మరీ ప్రచారం చేశారు కేసీఆర్. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మాత్రం... గుండు సున్నానే  వచ్చింది.
 
గులాబీ పార్టీ ఏర్పాటు అయి దాదాపు 20 సంవత్సరాలకు పైగా అయిపోయింది. ఈ 20 సంవత్సరాల చరిత్రలో... పార్లమెంట్ స్థానం గెలవకుండా గులాబీ పార్టీ ఎప్పుడు లేదు. కచ్చితంగా కెసిఆర్ లేదా విజయశాంతి.. ఇలా ఎవరో ఒకరు గెలిచేవారు. కానీ 2024 పార్లమెంటు ఎన్నికల  సమయంలో మాత్రం... 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఈ గులాబీ పార్టీ. దీంతో.. కెసిఆర్ కు భారీ ఓటమి ఎదురైంది.


రంగంలోకి దిగి గ్రౌండ్ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ... కెసిఆర్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయలేదు. అలాగే ఈ సంవత్సరంలో కెసిఆర్ ఫాంహౌస్ ను దాటి బయటికి రాలేదు. అసెంబ్లీ రెండు నుంచి మూడుసార్లు జరిగిన కూడా అక్కడికి వెళ్లలేదు. అసెంబ్లీ బడ్జెట్ పెట్టిన రోజు మాత్రమే వెళ్లారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గులాబీ పార్టీ మాత్రం ప్రతిపక్ష హోదాలో బాగా పనిచేస్తుంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మళ్లీ కేసీఆర్ ని గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రజలు కూడా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: