జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. 2014లో పవన్ పొలిటికల్ ప్రస్థానం మొదలు కాగా ఆ సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఐదేళ్లు ఓపికగా ఎదురుచూసి చివరకు అనుకున్న లక్ష్యాలను అయితే సాధించారనే చెప్పాలి. పవన్ పొలిటికల్ జర్నీ గురించి పుస్తకం రాయొచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీతో ఎంతోమందిలో స్పూర్తి నింపారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకోగా రాజకీయాల్లో అంతకు మించిన మంచి పేరును సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ తనపై వచ్చిన విమర్శలను సైతం పట్టించుకోకుండా ముందడుగులు వేశారు.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. సాధారణంగా చాలామంది చిన్నచిన్న ఎదురుదెబ్బలు తగిలితే కూడా కెరీర్ పరంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను గెలవడంతో పాటు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్లను గెలిపించుకునే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
 
జనసేన పార్టీ రాజకీయంగా మరింత బలపడాలని సొంతంగా పోటీ చేసినా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ 2029 ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: