తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అంటే ఎక్కువ మందికి తెలియదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ బిజెపి, కాంగ్రెస్ ఎక్కడ కూడా లేవకుండా చేశారు. అలా పది సంవత్సరాలు ఏకదాటిగా పాలించిన బీఆర్ఎస్ ఆ తర్వాత మూడవ దశ దారుణంగా విఫలమైంది. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి ఇంటికే పరిమితమైంది. అలాంటి ఈ తరుణంలో గత 2019 ఎలక్షన్స్ నుంచి మొదలు బిజెపి అనూహ్యంగా పుంజుకుంటూ వస్తోంది. ఒకప్పుడు మూడు నుంచి నాలుగు సీట్లు దాటని బీజేపీ ప్రస్తుత కాలంలో చాప కింద నీరులా పుంజుకుంటూ 8 సీట్లకు ఎగబాకింది. ముఖ్యంగా తెలంగాణలో బండి సంజయ్ ఎప్పుడైతే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అయ్యారో అప్పటినుంచి యూత్ లో బిజెపి ఫాలోయింగ్ పెరిగి గ్రామ గ్రామంలో కమిటీలు వేయడం, మండల స్థాయి కమిటీలు వేయడం ఇలా బిజెపి ప్రతి నియోజకవర్గంలో పాతుకు పోయింది. అంతేకాకుండా ఈ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2024 పార్లమెంటు ఎలక్షన్స్ సమయంలో బిజెపి అద్భుతమైన ఓట్లు సాధించి రాబోవు రోజులు మావే అని నిరూపించుకుంది. అలా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచి అద్భుతమైన విజయాన్ని సాధించారు.

 బిజెపిలో గెలిచిన అభ్యర్థులు:


సిర్పూర్ నియోజకవర్గం నుంచి పాల్వాయి హరీష్ బాబు, అదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్ పవర్, ఆర్మూరు నుంచి పైడి రాకేష్, కామారెడ్డి నుంచి కే వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి సూర్యనారాయణ, గోషామహల్ నుంచి రాజాసింగ్ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు విజయాన్ని సాధించి అసెంబ్లీలో వారి గళాన్ని వినిపిస్తున్నారు..అసలు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి బతికి బయటపడడం చాలా కష్టం అనుకున్న తరుణంలో చాప కింద నీరులా అద్భుత విజయాన్ని సాధించారు. పార్లమెంటు ఎలక్షన్స్ లో మొత్తం 17 సీట్లకు గాను 8 సీట్లను గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని పూర్తిగా బిజెపి కైవసం చేసుకుంది.


 ఇలా బిజెపి ప్రతి ఎలక్షన్స్ లో ఒక్కో మెట్టెక్కుతూ 2029లో పూర్తిగా తెలంగాణలో మాదే ప్రభుత్వం అంటూ ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా బిజెపి నుంచి గెలిచినటువంటి బండి సంజయ్ కి  కేంద్రంలో కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి రావడం, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి చాలామంది నాయకులకు  జాతీయ స్థాయిలో బిజెపి సముచిత స్థానాలను అందించడం 2024 లో జరిగింది. ఇలా నామరూపాల్లేని బిజెపి చివరికి బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా గెలవకుండా చేసి ఆ స్థానాన్ని గెలుచుకుంది అంటే రాబోవు రోజుల్లో బిజెపికి తెలంగాణలో మంచి రోజులు ఉండబోతున్నాయని రాజకీయ మేధావులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: