2024 జనసేనకు బాగా కలిసివచ్చింది.  2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం అందుకుంది. ఈ ఎన్నికల్లో జనసేన 21 శాసనసభ, రెండు లోక్ సభ స్థానాలలో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన గణ విజయాన్ని అందుకుంది. దాదాపుగా అన్నిచోట్ల జనసేన అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలిచారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏకంగా 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

భీమవరంలో ఆ పార్టీ అభ్యర్థి పులపర్తి అంజి 66 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తెనాలిలో ఉన్న నాదేండ్ల మనోహర్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. వైసిపి అభ్యర్థి అన్నాభత్తుని శివకుమార్ పై 48112 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు. తాడేపల్లి గూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం పొందాడు. 62 వేల 492 ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై బోలిశెట్టి విజయం అందుకున్నారు.


ఇలా కీలక జనసేన నేతలు విజయాన్ని సాధించారు. 2024 సంవత్సరంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచాడు. భారీ మెజారిటీతో వైసిపి పార్టీని చిత్తు చేసి మరి పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డాడు. టిడిపి, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీలను కలపడానికి చాలా కష్టపడ్డాడు.


దాని ఫలితంగానే ఏపీలో జనసేన పార్టీ వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం అందుకుంది. అలాగే ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ . కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఎప్పుడంటే అప్పుడు మోడీ అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే దొరకడం విశేషం. ఇక మరో నాలుగు సంవత్సరాలు పార్టీని బలోపేతం చేసుకుంటే తర్వాత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే ప్రచారాలు జరుగుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: