తాజాగా రేవంత్ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ భేటీలో కొంతమంది హీరోలు, డైరెక్టర్లు,ప్రొడ్యూసర్లు పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. వీరిలో ముఖ్యంగా అల్లు అరవింద్, దిల్ రాజు,వెంకటేష్,నాగార్జున, మురళీమోహన్,త్రివిక్రమ్, నాగ వంశీ వంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ భేటీ ముఖ్య ఉద్దేశం బెనిఫిట్ షోలను రద్దు చేయకుండా మళ్ళీ స్టార్ట్ చేయాలని సినీ ఇండస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారట. కానీ దానికి తెలంగాణ ప్రభుత్వం నో చెప్పినట్టు తెలుస్తోంది. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు కరాకండిగా చెప్పిందట. అంతేకాకుండా బెనిఫిట్ షోలు రద్దు చేస్తే రద్దు చేయండి కానీ కనీసం టికెట్ రేట్లు అయినా పెంచండి అంటూ కోరారట.కాని దానికి కూడా రేవంత్ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది..

 అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుగుదలకు కచ్చితంగా  తోడ్పడుతాం అంటూ తెలంగాణ గవర్నమెంట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వం భేటీ అవ్వడంతో అంబటి రాంబాబు తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ ట్వీట్ చేశారు.ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో సమస్య పరిష్కారం అవ్వాలంటే "సోఫా" చేరాల్సిందే అంటూ ఒక షాకింగ్ చేశారు. ఇక సోఫా అంటే పుష్ప టు సినిమాలో సీఎం చేంజింగ్ కోసం సోఫాలో డబ్బులు పెట్టి అల్లు అర్జున్ పంపే సన్నివేశం అందరూ చూసే ఉంటారు.

అయితే ఆ సన్నివేశాన్ని ఇక్కడ కన్వర్ట్ చేసి ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే సోఫా పేరుతో ఉండే డబ్బులు చేరాల్సిందే అంటూ ఆయన పరోక్షంగా ట్వీట్ చేశారని పలువురు భావిస్తున్నారు. అలాగే అంబటి ట్వీట్ పై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.కొంతమంది ఏమో రేవంత్ రెడ్డికి భారీగానే డబ్బులు అందాయి అంటే మరికొంత మందేమో రేవంత్ రెడ్డి దాదాపు 200 కోట్లు తీసుకున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: