- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .


పరుచూరి రామకోటేశ్వరరావు, అర‌కు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్, మాధవి, కోటపాటి సీతారామరావు గారి పుత్రిక అక్షత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 25 వ తేదీ బుధవారం రాత్రి 12.37 నిమిషాలకు సుముహూర్తంలో అభినయ్ తేజ్, అక్షత వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

 
అభియన్ తేజ్, అక్షత వివాహ వేడుక లో అతిథులుగా కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు హోం మంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, రుడా ( రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జీసీసీ ఛైర్మన్ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.


అలాగే బీజేపీ నాయకులు లక్ష్మణ్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, యాక్టర్స్ వడ్డే నవీన్, తరుణ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శివ బాలాజీ, డైరెక్టర్స్ దశరథ్, హరీశ్ శంకర్, తదితరులు పాల్గొని నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు. ఇక కొత్త‌ప‌ల్లి గీత గ‌తంలో ఏజెన్సీ లో ఆర్డీవో గా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ఆమె 2014 ఎన్నిక‌ల్లో అర‌కు పార్ల‌మెంటు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నిక‌ల వేళ సొంత పార్టీ పెట్టి విశాఖ పార్ల‌మెంటు కు పోటీ చేసి ఓడిపోయిన గీత .. ఈ యేడాది పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అర‌కు నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: