తన నియోజవర్గంలో రేపు అరెస్టు చేస్తారు ఎల్లుండి అరెస్టు చేస్తారనే విషయం పైన దమ్ముంటే అరెస్ట్ చేసుకోమంటూ ఒక సంచలనాత్మకంగా ప్రకటన విడుదల చేసింది రోజా. తాను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నానని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను వెనకడుగు వేసే పరిస్థితి లేదని తెలియజేసింది వైసీపీ నేత రోజా. తమ గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతలో నగరిలో మీటింగ్ జరగడం ఉత్తేజం కలిగిస్తోంది అంటు తెలిపింది. ఇప్పటిదాకా పెద్దిరెడ్డి నుంచి వచ్చిన త్రెడ్ లేదని కూడా వెల్లడించింది రోజా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం వల్ల ఓడిపోయిందని తెలిపింది.
ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారు అంటూ తెలియజేస్తోంది రోజా. రాష్ట్రంలో జగన్ ఓడిపోయినందుకు ప్రజలే బాధపడుతున్నారని తెలిపింది.. జగన్ ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చారు.. ఒకప్పుడు విద్యా దీవెన, రైతు రుణమాఫీ ఇవే కాకుండా చాలా పథకాలు కూడా ప్రజలకు అందినాయి.. సంపద సృష్టిస్తారని చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రావాలని బలంగా ప్రజలు కోరుకుంటున్నారు అంటూ తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిందని.. పచ్చ డ్రెస్ వేసుకొని ఎన్నికల ముందు ఊదరగొట్టారు.. ఇప్పుడు నరకం చూపిస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యింది. గత ప్రభుత్వంలో స్కూల్ అని అభివృద్ధి చేయగా ఈ ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేస్తుందంటూ తెలిపింది. అలాగే తనని అరెస్టు చేస్తారు అరెస్టు చేస్తారని ప్రచారం చేసుకుంటున్నారు.. అలాంటి విషయమే జరగదని ఎందుకంటే మనం తప్పులు చేయలేదు .. తప్పుచేసి మనం ఓడిపోలేదని విషయాన్ని వైసిపి ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలని తెలిపింది రోజా.. మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది ఆరోజు వడ్డీతో సహా అందరికీ తిరిగి ఇస్తామంటూ తెలిపింది రోజా. మా ధైర్యం వైసిపి పార్టీ జగనన్న అంటూ తిరిగింది రోజా.