2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... పెను సంచలనాలు నమోదు అయ్యాయి. ఎవరు ఊహించని విజయాలు అలాగే అపజయాలు కూడా ఎదురయ్యాయి. అయితే 2024 సంవత్సరంలో... తెలుగుదేశం పార్టీ కీలక నేత... వంగలపూడి అనిత కెరీర్ ఒక్కసారిగా  మారిపోయింది. ఆమె ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా... ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ కావడం గమనార్హం.


అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా... చంద్రబాబు ప్రభుత్వంలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కూటమి ఈ 2024 సంవత్సరంలో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ తరుణంలోనే ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ నుంచి... ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యారు వంగలపూడి అనిత. తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వంగలపూడి అనిత.. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.


ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సీమాంధ్రలో టిడిపి ఎమ్మెల్యేగా 2014లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత వైసిపి ప్రభంజనం కారణంగా 2019లో ఓడిపోయారు వంగలపూడి అనిత. ఇక 2024 సంవత్సరం మాత్రం ఆమెకు బాగానే అచ్చి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డి పై పోరాటం చేయడంతో 2024 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు.


దీంతో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఎదిగారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో హోం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు వంగలపూడి అనిత. ప్రస్తుతం ఏపీ హోం మంత్రిగా తన బాధ్యతలను చకచకా నిర్వహిస్తున్నారు. అయితే.. ఆమె హోం మంత్రి అయిన తర్వాత ఏపీలో క్రైమ్ రేట్ క్రమక్రమంగా పెరుగుతోందని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే లెక్కలు కూడా ఆలోచించడం ఆమెకు మైనస్ గా మారింది. ఇప్పుడే ఈ మైనస్ ను కాస్త ప్లేస్ చేసుకుంటే... ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్తుంది. అ దిశగానే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత అడుగులు పడే ఛాన్స్ ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: