ఇటీవల తుమ్మూ విజయ్‌ కుమార్ రెడ్డి పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయన గత ప్రభుత్వంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా పనిచేశారు. గవర్నమెంట్ యాడ్స్ అన్ని కూడా కొన్ని మీడియా సంస్థలకే ఆయన జారీ చేశారని, బిల్లు చెల్లింపు విషయంలో కూడా కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలతో అతనిపై కేసు నమోదు. సాక్షి టీవీ దాదాపు 374 కోట్లు ఆస్తి వచ్చేలాగా వారికి ప్రకటనలు చేశారని, మిగతా టీవీలకు 30 కోట్లు విలువైన ప్రకటనలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈనాడు, సాక్షి ఈ రెండింటి మధ్య వివక్ష చూపారంటూ ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పొలిటికల్ అనలిస్టులు వైసీపీ సర్కార్ సర్కులేషన్ ఆధారంగానే యాడ్స్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు. ఈనాడు సర్కులేషన్ బాగా ఉంది కాబట్టి దానికి ఎక్కువగా ప్రకటనలు ఇచ్చినట్లు చెబుతున్నారు..అంతేకాదు సాక్షి, ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ మిగతా అన్ని మీడియా సంస్థల విషయంలో ఎలాంటి వివక్షత చూపలేదని పేర్కొంటున్నారు. అసెంబ్లీ లైవ్, ముఖ్యమంత్రి లైవ్ వంటి వాటికి ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు టెండర్లకి పిలవలేదు. సో గత ప్రభుత్వం అలా చేయలేదని చంద్రబాబు ఇప్పుడు ఆరోపించడం వింత అని అనుకోవచ్చు.

ఇలాంటి అవకతవకులు అవి అన్ని ప్రభుత్వాల్లోనూ కనిపిస్తున్నాయని చెబుతున్నారు. టెండర్ల విషయంలో ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మరొక కేసుకు ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. అదేంటంటే సాక్షి మీడియా ఉద్యోగులను ఐఆర్ అండ్ పీఆర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్లలో అక్రమ దారులలో విజయ్‌ కుమార్ రెడ్డి నియమించారని ఆరోపణలు వెల్లువత్తాయి. అయితే వీటి వల్ల విజయ్ కుమార్ రెడ్డి చిక్కుల్లో పడవచ్చు అని పొలిటికల్ అనలిస్టులు వ్యాక్యనిస్తున్నారు. ఇలాంటి నియామకాలు అన్ని ప్రభుత్వాల్లో జరుగుతాయని కానీ టిడిపి దీనిని తెలివిగా ప్రొజెక్ట్ చేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: