ఈ ఏడాది వైసీపీ పార్టీకి అలాగే పార్టీ అధినేత జగన్ ఎంతగానో గుర్తుండిపోతుంది.. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి విజయభేరి మ్రోగించిన వైసీపీ పార్టీ ఈ ఏడాది తీవ్ర పరాభవాన్ని చవిచూసింది..ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లే సాధించి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.. ఇంతటి భారీ ఓటమికి కారణం ఎన్నికలకు ముందు జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం..ఎమ్మెల్యే అభ్యర్థులను వారికీ పట్టు వున్న నియోజకవర్గం నుంచి బదిలీ చేసి జగన్ అతిపెద్ద తప్పు చేసారు..జగన్ ను టెన్షన్ పెట్టిన నియోజకవర్గాలలో తాడికొండ నియోజకవర్గం ఒకటి.. ఇది రాజధాని అమరావతి పరిధిలో వుంది..మూడు రాజధానుల నెపంతో అమరావతి రైతులు, ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు..ఇదే సమయంలో 2019 ఎన్నికలలో తాడికొండ నుంచి గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి  టీడీపీ పక్షాన చేరారు. 

రాష్ట్రవ్యాప్తంగా జగన్ గాలి వీచిన 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసిన తెనాలి శ్రవణ్ కుమార్ మీద కేవలం నాలుగువేల ఓట్ల మెజారిటీతో ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు..అమరావతి ఉద్యమం కారణంగా స్థానికంగా వైసీపీ మీద వున్న వ్యతిరేకత తొలగించాలని ఆ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను  నియమించారు.సుచరిత సైతం ఆ నియోజకవర్గానికి వెళ్లేందుకు సుముఖంగా ఉండటంతో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు..అయితే 2009లో ఎమ్మెల్యేగా సుచరిత తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు... అప్పటి ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సుచరిత ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆ తరువాత 2011లో వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు.

2012లో ప్రత్తిపాడులో జరిగిన ఉపఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత.. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు... ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకంగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలవడంతో వైఎస్ జగన్ మంత్రివర్గంలోఆమె కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు.అయితే జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మూలంగా సుచరిత తాడికొండ నుంచి పోటీ చేసారు.. కానీ ఆమె ఓటమి పాలయ్యారు..దీనితో సుచరిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు.. దీనితో అందరూ ఆమె పార్టీ మారుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగానే పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నట్లు ఆమె తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: