మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శకం ముగిసింది. ఆయన గురువారం నాడు ఆయన తన తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. అతని కుటుంబం చాలా పేదది, అందువల్ల ఆయన చిన్నతనం నుంచి  చాలా కష్టపడి పని చేయాల్సి వచ్చింది. 1947లో భారతదేశం విభజించబడిన తర్వాత, సింగ్ కుటుంబం భారతదేశానికి తరలివెళ్లింది, అప్పుడు అతని వయస్సు కేవలం 15 సంవత్సరాలు.

సింగ్ తన ప్రారంభ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ అతను ఎప్పుడూ కూడా తన ప్రయత్నాలను వదులుకోలేదు. అతను తన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. తరువాత 1948లో హిందూ కళాశాలలో చేరారు. సింగ్ ఆర్థికశాస్త్రంలో ఆసక్తి పెంచుకొని మరింత చదవాలనుకున్నారు, కానీ తగినంత డబ్బు లేక చాలా నిరాశ చెందారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని ఎంతో కష్టంతో అధిగమిస్తూ, కష్టపడి పంజాబ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ సంపాదించారు.

ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలలో సీటు సంపాదించి అక్కడ ఫైనాన్షియల్ కోర్సులు చేశారు. సింగ్ ట్యూషన్, జీవన ఖర్చులు సంవత్సరానికి దాదాపు 600 పౌండ్లు అయ్యేవి. తన స్కాలర్‌షిప్, అతని తండ్రి మద్దతుతో ఆ ఖర్చులను ఎలాగోలా మేనేజ్ చేసుకునేవారు. ఒక్కోసారి ఏ ఫ్యామిలీ పంపించే డబ్బులు త్వరగా అందేవి కావు. వారి పేదవాళ్లు కాబట్టి సమయానికి డబ్బులు అడ్జస్ట్ కాక పంపించలేక పోయేవారు. అప్పుడు మన్మోహన్ ఎలాంటి కంప్లైంట్ చేయకుండా ఉండేవారు డబ్బులు ఉన్నప్పుడు ఆహారం తినేవారు లేదంటే పస్తులు ఉండేవారు. ఒకవైపు ఆకలి బాధిస్తున్నా మరోవైపు చదువుకోవాలనే కోరికతో ఆయన ముందు అడుగులు వేశారు.

సింగ్ తన పట్టుదల, కృషి, ప్రతిభతో 2004లో భారత ప్రధాని అయ్యారు. 2014 వరకు పనిచేశారు. భారతదేశంలో పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన కృషి, అమలు చేసిన అద్భుతమైన ఆర్థిక విధానాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతేకాదు, విద్యా, ఆరోగ్య రంగాల్లో సంస్కరణల కోసం ఆయన గట్టిగా వాదించారు. భారతదేశ అత్యుత్తమ, గౌరవనీయ నాయకుల్లో ఆయన ఒకరిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: