- మంత్రి పదవి చేపట్టిన ఒంటరవుతున్నారా?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహిళా మంత్రులు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సీతక్క మరియు కొండా సురేఖ. ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన మహిళా మణులు. ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో ఇద్దరికీ మంత్రి పదవులు వరించాయి. కానీ ఇందులో మంత్రి పదవి వచ్చినా కానీ కొండా సురేఖకు మాత్రం మంత్రివర్గంలో తగిన గౌరవం, మర్యాదలు లభించడం లేదట. 2023- 24 సంవత్సరం ఈమెకు కాస్త కలిసి వచ్చినా, వివాదాలు ఎక్కువయ్యాయని అంటున్నారు. అలాంటి కొండా సురేఖ ఏ ఏ వివాదాల్లో చిక్కుకుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం.
'కొండా'కు అండలేదా?
రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కొండా సురేఖ అప్పుడప్పుడు కొన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈమె 1995లో మండల పరిషత్ నుంచి రాజకీయాన్ని మొదలుపెట్టి 1996లో పీసీసీ సభ్యురాలు అయింది. 1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, 2000 సంవత్సరంలో ఏఐసీసీ సభ్యురాలుగా నియమితురాలయింది. మళ్లీ 2004లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందింది. మళ్లీ 2009లో పరకాల ఎమ్మెల్యేగా గెలుపొంది మహిళా శిశువు సంక్షేమ వికలాంగులు జవైనల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది. మళ్లీ 2014లో సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందింది. 2018లో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరింది. 2023లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె తెలంగాణ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ప్రస్తుతం ఈమెకు పర్యావరణం, అటవీ ఎండోమెంట్ శాఖలు కేటాయించబడినయి.