విడుదల రజిని యంగ్ అండ్, డైనమిక్, ఎనర్జీటిక్ లీడర్ గా పేరు పొందిన ఈమె గురించి ప్రేత్యేకం గా చెప్పనవసరం లేదు.2014 ఎన్నికల సమయంలో చాలా మంది ఎన్నారైలు టీడీపీకి సపోర్ట్ చేయగా రజిని కూడా సపోర్ట్ చేశారు. ఈ తరుణంలో విడుదల రజిని 2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇదిలావుండగా ప్రతిపాటి పుల్లారావు 2017లో విశాఖపట్నంలోని మహానాడులో విడదల రజినితో మాట్లాడించారు. ఈ వేదికగా తన వాక్చాతుర్యంతో విడదల రజిని అందర్ని అట్రాక్ట్ చేసింది. ’హైదరాబాదులోని సైబరాబాద్ లో మీరు నాటిన ఈ మొక్క’ అంటూ రజిని చేసిన ప్రసంగం చంద్రబాబునే కాదు తెలుగుదేశం పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అందరి ద్రుష్టిని ఆకర్షించింది. ఆనాడు ఆమె మాట్లాడిన మాటల వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పార్టీలోనే కాదు తెలుగింట రజిని ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఇలా ఓవర్ నైట్ సార్ట్ గా మారిన  ఆమె తనకు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, తాను విఆర్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, తనకు చిలకలూరిపేట నుంచి తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరరామె. కానీ, అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న పుల్లారావుని కాదని, తనకు సీటు ఇవ్వాలనేనని క్లియర్ కట్గా చెప్పేశారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ సరైన వేదికగా కాదని భావించిన ఆమెరాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు రజిని. పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పార్టీలో చేరాలని భావించారు. 

ఈ క్రమంలోనే  విడదల రజిని  గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి తన ప్రత్యార్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే 2022 ఏప్రిల్ 11 జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడతల రజిని తన మంత్రివర్గంలో తీసుకున్నారు.  వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు.ఈ క్రమంలో తొలిసారి బీసీ మహిళ ఎమ్మెల్యేగా అయి విడుదల రజిని చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి చేతిలో 51150 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో రజని రాజకీయానికి స్పీడ్ బ్రేక్ పడింది.ఈ క్రమంలో విడదల రజనీ పార్టీని వీడతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఆమె వర్గీయులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. విడదల రజనీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో నే తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మార్చేశారు. మాజీ మంత్రి విడదల రజినికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం.మొన్నటి వరకు చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కావటి మనోహర్‌నాయుడిని తప్పించి మాజీ మంత్రి రజినిని అక్కడికి పంపించారు. మున్ముందు రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: