అయితే అక్కడికి వచ్చిన వారందరూ కేవలం కడప జిల్లా ప్రజల్లే కాకుండా రాయలసీమలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ప్రజా దర్బార్ కి వచ్చినట్లు సమాచారం. ఈ విధంగా చూసుకుంటే జగన్ నిర్వహించినటువంటి ఈ ప్రజా దర్బార్ కి మంచి స్పందన లభించిందని వైసిపి నేతలు కూడా తెలియజేస్తున్నారు. జగన్ సైతం ఓపికగా వచ్చిన వారందరూ సమస్యలను వింటూ చాలా మందితో మాట్లాడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే తన వద్ద వచ్చిన సమస్యలను సైతం పరిష్కరించేందుకు చూస్తానంటూ భరోసా ఇస్తున్నారట.
గతంలో సీఎంగా ఉన్న జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీసులోనే ఎక్కువగా ఉండేవారని జనంలో సీఎం అయిన తర్వాత చాలా తక్కువగా ఉన్నారని గతంలో చాలామంది ట్రోల్ చేశారు. మళ్లీ ఇప్పుడు పులివెందుల ప్రజాదర్బార్ జగన్ తో పాటుగా వైసీపీ నేతలకు సైతం కొత్త జోష్ నింపిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ అనే వ్యక్తి మాస్ లీడర్ అంటూ మరొకసారి రుజువయిందనే విధంగా జనాలు మాట్లాడుకునేలా చేస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రజాదర్బార్ తోపాటు వైసీపీ నేతలకు సరికొత్త సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెల నుంచి చివరిలో జగన్ జనంలోకి రాబోతున్నారు. మరొకసారి పర్యటనలో భాగంగా సామాన్యుల దగ్గరికి జగన్ ప్రజా దర్బార్ తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుందని చూస్తున్నారట. మరి ఈ ఏడాది వైసీపీ పార్టీకి చేదు మిగిలినప్పటికీ వచ్చే ఏడాది ఏ రకంగా కలిసొస్తుందో చూడాలి.