ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ గత కొన్నేళ్లతో పోల్చి చూస్తే భారీగా తగ్గిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో భూ క్రయ, విక్రయాల ద్వారా ఏపీ ఆదాయం భారీ స్థాయిలో పెరగగా కూటమి సర్కార్ డీకేటీ, ఇనామ్ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో కొన్ని నియమ నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. నిజమైన భూ హక్కుదారులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
 
అయితే రెవిన్యూ రికార్డులు ఆన్ లైన్ అయిన తరుణంలో ఫైళ్లు కాలిపోయినా నష్టమేంటని వైసీపీ నేతల నుంచి ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఫ్రీ హోల్డ్ ఎత్తేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో కూటమి సర్కార్ చెప్పినా వాస్తవంగా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. జనవరి రెండో వారంలో రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తేస్తామని ఏపీ సర్కార్ చెబుతుండటం కొసమెరుపు.
 
మరి ఆ సమయానికి నిజంగా ఎత్తేస్తుందా? లేదా? అనే ప్రశ్నలకు మాత్రం జవాబులు దొరకాల్సి ఉంది. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ నిజమైన లబ్ధిదారులను సైతం ఇబ్బంది పెట్టే విధంగా ఈ నిర్ణయం ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఈ కామెంట్లపై ఏపీ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
 
కూటమి సర్కార్ పాలన బాగానే ఉన్నా సంక్షేమ పథకాలను నిదానంగా అమలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్హుల సంఖ్యను సైతం కూటమి సర్కార్ భారీగా తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ తీసుకునే వాళ్లకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. జనవరి 1వ తేదీన సెలవు దినం కావడంతో ఈ నెల 31వ తేదీనే పెన్షన్ పంపిణీ జరిగేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: