కొండ సురేఖ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ మధ్యకాలంలో కొండా సురేఖ ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సమంత, కేటీఆర్ గురించి తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడి సెన్సేషన్ అయ్యారు. అనంతరం వేములవాడలో లేగలు అమ్ముకున్నారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


అనంతరం మందు పార్టీ చేసుకొని ఓ వీడియోను షేర్ చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారి ఆదాయం గురించి మాట్లాడి హాట్ టాపిక్ అవుతున్నారు. తెలంగాణ భక్తుల వలనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అధికంగా వస్తుందని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంను దర్శించుకున్నారు.


ఈ క్రమంలో తిరుమలపై కొండా సురేఖ చేసిన వాక్యాలు ప్రస్తుతం వార్తలలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. తిరుమలకు తెలంగాణ నుంచి అధికంగా భక్తులు వస్తున్నారని అదే విధంగా తమ స్టేట్ నుంచి తిరుమలకు అధికంగా ఆదాయం చేకూరుతుందని మాట్లాడినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీశైలం భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాక కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.


గతంలో సమైక్యంగా ఉన్నప్పుడు శ్రీశైలం మా గుడిగా ఉండేదని, ఇప్పుడు స్టేట్స్ విడిపోవడం వల్ల శ్రీశైలాన్ని కోల్పోయామని కొండ సురేఖ అన్నారు. తిరుమలలో తెలంగాణ భక్తుల నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. గతంలో తిరుమలలో పద్ధతులు, నియమాలు చాలా బాగుండేది. తెలంగాణలో టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల డెవలప్మెంట్ లకు ప్రత్యేక చొరవ చూపించేవారని కానీ ఇప్పుడూ అలాంటివి ఏమీ చేయడం లేదంటూ కొండా సురేఖ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: