ఏపీలో ఈ యేడాది జరిగిన ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఈ క్రమంలోనే ఏజెన్సీలోని పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ పేరు చెబితేనే వైసీపీకి కంచుకోట. ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానంలో వైసిపి అభ్యర్థి ఎవరు ? అన్నదానితో సంబంధం లేకుండా 2014 - 2019 - 2023 మూడో వరుస ఎన్నికలలో వైసిపి వరుస విజయాలు సాధించింది. ఇక్కడ కూటమి ప్రభంజనం వీయలేదు. టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై మత్స్యరాస విశ్వేశ్వర రాజు గెలిచారు. ఆ తర్వాత సంస్థాగత మార్పులలో మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి జగన్ రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవి తో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం లో సభ్యురాలుగా పదవి ఇచ్చారు. ఇటు విశ్వేశ్వర రాజు ను అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే నియోజకవర్గంలో పట్టు కోసం విశ్వేశ్వర రాజు వర్సెస్ భాగ్యలక్ష్మి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి విశ్వేశ్వర రాజును పక్కనపెట్టి తాను తిరిగి టిక్కెట్ దక్కించుకోవాలని భాగ్యలక్ష్మి తన పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.
ఈ క్రమంలో విశ్వేశ్వర రాజు గెలిచిన కూడా అసలు నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయటం ? లేదని భాగ్యలక్ష్మి వర్గం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తోందట. అయితే ఇక్కడ విశ్వేశ్వర రాజు దర్శన్ మరోలా ఉంది పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా విశ్వేశ్వర రాజుకు అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజల తరఫున గొంతు వినిపించే అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా వీరిద్దరి గొడవ మధ్యలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పక్క చూపులు చూస్తున్నారు. ఇలా పాడేరులో వైసిపి గెలిచినా కుమ్ములాటలు తప్పడం లేదు. ఇవన్నీ తెలిసిన పార్టీ ఏదైనా జగన్ .. ఇప్పటికే వీరిని ఒకసారి అమరావతికి పిలిచి వార్నింగ్ ఇచ్చినా వీరి తీరులో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.