అంతకుముందు జగన్ పాదయాత్ర సమయంలో చాలామంది తలలపై ముద్దు పెట్టుకుంటూ హత్తుకుంటూ చాలా ఆప్యాయంగా ప్రవర్తించారు. అయితే 2019లో గెలిచిన తర్వాత ఆయన జనాలకు కలవకుండా పోయారు. అసలు సొంత ఎమ్మెల్యేలను మంత్రులను కూడా ఆయన మీటైన దాఖలాలు లేవు. నెలకోసారి ప్రోగ్రాం పెట్టారులే కానీ అందులో కూడా దూరం నుంచి చేతులు ఊపి వెళ్లిపోవడమే జరిగింది. నెమ్మదిగా కార్యకర్తల నుంచి ప్రజల వరకు అందరికీ దూరమైపోయారు. సమాధానాలు కూడా చెప్పకుండా ఆయన తన సొంత ప్రపంచంలో మునిగితేలారు. ముఖ్యమైన సమస్యలకు ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పలేదు. అందువల్ల ఆయన ఇమేజ్ బాగా దెబ్బ తిన్నది.
అయితే భారీగా సీట్లు కోల్పోయి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్ కి జ్ఞానోదయం అయినట్లుగా తెలుస్తోంది. లేదా ఆయన తన బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి ఆలోచన తీరును మంచిగా మార్చుకొని ఉండొచ్చు. ఇటీవల కాలంలో జగన్ ను చూస్తుంటే అందరికీ సెల్ఫీలు ఇస్తున్నారు. అంతేకాదు వారిలో మమేకమవుతూ అసలైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కడప జిల్లాలో నాలుగు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. తర్వాత బెంగళూరు వెళుతూ మార్గం మధ్యలో కూడా చాలామందిని కలుసుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మార్గంలో కార్యకర్తలతో ఆయన సెల్ఫీలు దిగటం, వారితో మాట్లాడటం చూస్తుంటే జగన్ చాలా మారిపోయారని స్పష్టంగా అర్థమవుతోంది.