గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ లో భారీ స్కాం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా కేసు పెట్టడం జరిగింది. దీనిపై విచారణ కూడా చేస్తున్నారు అధికారులు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. అటు ఫార్ములా ఈ కార్ రేసులో... ఈడి అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే తాజాగా ఈ కేసులో... టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు... నోటీసులు ఇచ్చారు.
ఈ మేరకు ఈడి అధికారులు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. జనవరి 7వ తేదీన... ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణకు రావాలని కల్వకుంట్ల తారక రామారావుకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ED అధికారులు రంగంలోకి దిగడంతో అరెస్టు ఖాయం అంటున్నారు.
కేటీఆర్ తో పాటు ఈ కేసులో ఇరుక్కున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ bln రెడ్డి లకు నోటీసులు ఇచ్చింది ED. అంటీ కరప్షన్ బ్యూరో ఎఫ్ ఐ ఆర్ ఆధారం చేసుకొని ed అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే హేమ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే గుర్తించారట అధికారులు. ఎఫ్ ఈ ఓ కు సంబంధించిన 55 కోట్ల నగదు బదిలీలో అక్రమాలు జరిగినందుకుగాను ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.