ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కువగా పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా సందర్భాలలో  అక్రమ రవాణా, తమ ప్రత్యర్థుల నాయకులు తమ పార్టీ కార్యకర్తల పైన, నేతల పైన దాడులు చేస్తే కచ్చితంగా అక్కడికి వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటించారు. అక్కడ పర్యటన నేపథ్యంలో వైసిపి నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవోని సైతం పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి వెళ్లినట్లు సమాచారం.



అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఆయన అభిమానుల పైన ఒక్కసారిగా మరో సారి ఫైర్ అయ్యారు.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నప్పటికీ అభిమానులు తనని ఓజి, ఓజి అంటూ నినాదాలు చేస్తూ ఉండడంతో విసిగిపోతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ ఏంటయ్యా మీరు ఎప్పుడు.. ఎక్కడ  ఎలాంటి స్లొగన్స్ ఇవ్వాలో తెలియదా పక్కకు పోండి అంటూ వారి పైన పవన్ కళ్యాణ్ అసహనాన్ని తెలియజేసినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


అనంతరం వైసిపి నేతలకు సైతం డిప్యూటీ సీఎం వార్నింగ్ ఇస్తూ ఎంపీడీవో మీద దాడికి పాల్పడిన వారి పైన కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కాబోతోంది. గడచిన కొద్ది రోజుల క్రితం కూడా సముద్రం మీదికి వెళ్లి మరి అక్రమ రవాణా బియ్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్.. ఇటు రాజకీయాలలో చాకచక్యంగా ముందుకు వెళుతున్న సమయంలో అభిమానులు మాత్రం తనని సినిమాల గురించి ప్రతిసారి పిలుస్తూ ఉండడంతో విసిగిపోయినట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే అభిమానులు చాలాసార్లు పవన్ కళ్యాణ్ ని విసిగించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: