హైదరాబాద్‌ లో హీరో అల్లు అర్జున్‌ ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమం లో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అయితే ఇప్పటిదాకా ఈ వివాదంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కానీ తాజాగా ఆయన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లగా, అల్లు అర్జున్ వివాదంపై మీడియా నుంచి పవన్ కళ్యాణ్ కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వివాదంపై స్పందించారు.
తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లారు. వైసిపి నేతల దాడితో గాయపడి, అతను ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పరామర్శించిన అనంతరం జవహార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పవన్. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నించారు.


అల్లు అర్జున్ వివాదంపై టీఎస్ సర్కార్ స్పందించింది. మీరేమంటారు? అని ప్రశ్నించగా రిలవెంట్ ప్రశ్నలు అడగండి ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా? పెద్ద మనసుతో ఆలోచించండి ,పెద్దగా ఆలోచించండి అంటూ పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడడానికి సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి అన్నట్టుగా పవన్ సమాధానం చెప్పడం గమనార్హం.అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్నారని, రీసెంట్ భేటీ తర్వాత సినిమా టికెట్లు, బెనిఫిట్ షోలు ఇవ్వడానికి ఒప్పుకోమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ వివాదంపై ఇప్పటి దాకా స్పందించని పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీడియా ప్రశ్నించినప్పటికీ సమాధానాన్ని దాటవేయడం చర్చకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: