ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారం కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. చంద్రబాబు నేతృత్వంలో ఇప్పుడు కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తాను అధికారంలోకి వస్తే సంపద అనేది సృష్టిస్తానని సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, ఏపీ ప్రజలు బాగోగులు తాను చూసుకుంటానని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. అయితే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్న ఏపీలో అప్పులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం 6 నెలల వ్యవధిలోని చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు రికార్డు స్థాయిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


బడ్జెట్టరి అప్పులు రూ.74,872 కోట్ల రూపాయలు చేరుకున్నట్లు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీస్ వేలం ద్వారా మరొక 5 వేల కోట్లు అప్పు చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారట. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా అప్పుల మీద ఫోకస్ చేశారనే విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. బడ్జెట్ యేతర  74,590 కోట్ల రూపాయలకు చేరిందట. కాగ్ నివేదిక ప్రకారం నవంబర్ వరకు 65,590 కోట్ల రూపాయల వరకు ఉన్నదట. మరొకవైపు ప్రభుత్వ గ్యారెంటీ బడ్జెట్ అప్పుల విషయానికి వస్తే మరో తొమ్మిది వేల కోట్లకు పైకి చేరబోతుందట.


ఇక తర్వాత రాజధాని అమరావతి పేరుతో.. హడ్కో జర్మనీ ప్రాంతానికి చెందిన కేఎఫ్ డబ్ల్యు సంస్థ నుంచి భారీగానే అప్పులు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే 31 వేల కోట్లు అప్పు చేసేందుకు మంత్రివర్గం ఇటీవల ఓకే చేసినట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. అలాగే సిఆర్డిఏ, మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధి శాఖ అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చారట. మరి ఈ అప్పులు ఇలాగే కొనసాగుతాయా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల మనసులో మొదలవుతోంది. అప్పులు చేయడం కంటే వాటిని కట్టడి చేయడమే మేలు అనేట్టుగా చాలామంది ప్రభుత్వం పైన పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: