ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలన్నీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. రాజకీయ నాయకుల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే అంత పక్షులు కూడా ఉంటాయి. తెలంగాణలో తరహాలో ఏపీ రాజకీయాలు ఉండవు. కక్షపూరిత రాజకీయాలు విపరీతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..! అయితే గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణను రాజు మధ్య తీవ్ర వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తేనే ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు... విజయం సాధించిన తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్లాడు. వైసిపి పార్టీలోనే ఉంటూ... జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్మీట్లో అలాగే టీవీ డిబేట్లో పాల్గొన్నారు రఘురామకృష్ణరాజు. అయితే దీంతో కోపానికి గురైన జగన్ మోహన్ రెడ్డి అతనిపై... కక్ష సాధింపు కేసులు పెట్టాడు.
అంతేకాదు పలుమార్లు రఘురామకృష్ణం రాజును జైలు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా అతని కాళ్లపై పోలీసులు కొట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు... తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు రఘురామకృష్ణం రాజు. ఈ నేపథ్యంలోనే ఉండి నియోజకవర్గ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక టిడిపి గాలి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆయనకు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది.
అయితే తాజాగా... వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన రివెంజ్ తీర్చుకునేందుకు... తన కారు నెంబర్ను... వైసీపీకి వచ్చిన అసెంబ్లీ సీట్లకు కలిసేలా... మార్చుకున్నారు రఘురామకృష్ణం రాజు. ap 11 ap 1111 అనే నెంబర్ తో ఉన్న ఫార్చునర్... రఘు రామ కృష్ణంరాజు వాడుతున్నారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డిని ట్రోలింగ్ చేయడానికి... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.