ఈ తరుణంలోనే ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు సీఎం పవన్ కళ్యాణ్. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించి వారికి అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి సహా ఇతరులపై న్యాయమూర్తి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ప్రధాన నిందితులు సుదర్శన్ రెడ్డి, భయ్యా రెడ్డి, వెంకట రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. పోలీసులు ఈ ముగ్గురిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారులపై దాడి చేస్తే వదిలేదిలేదని చెప్పారు. వైసిపి నేతల కళ్ళు నెత్తిన పెట్టుకొని ఉన్నారు. ఆ కళ్ళను కిందికి దించుతానంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎంపీడీవోపై దాడి చేసిన 12 మంది వైసిపి నేతలు సుదర్శన్ రెడ్డిలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడులు చేస్తే గత ప్రభుత్వం లాగా వదిలేది లేదన్నారు.
దానిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు హర్షనీయం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పరారీలో ఉన్న వారిని వెంటనే పట్టుకోవాలని అన్నారు. సుదర్శన్ రెడ్డి లాయర్ అయినా తప్పు చేస్తే ఏ చట్టం నిన్ను రక్షించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అయితే... హోం మంత్రి అనిత స్పందించకముందే... పవన్ రియాక్ట్ అయ్యారు. దీంతో.. అనిత మంత్రి ఉండి దండగా అంటున్నారు వైసీపీ నేతలు.