ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొదట ఈ ఇద్దరు సోదరులు కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత వైసిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి వల్ల టిడిపి పార్టీ ఎన్నోసార్లు ఓడిపోవడం కూడా జరిగిందట. అలా శ్రీకాకుళం జిల్లాలో కింజారావు కుటుంబానికి సరి జోడిగా ధర్మాన సోదరులు అడ్డుకట్టు వేయడం జరిగిందట .అయితే 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత  మాత్రం ధర్మన సోదరులలో చిన్న వారు అయిన మాజీ మంత్రి ప్రసాదరావు రాజకీయం నుంచి బయటికి వచ్చేసారని ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ తాజాగా చూస్తే ఇప్పుడు మరొక ప్రచారం వైరల్ గా మారుతున్నది.


అదేమిటంటే మాజీ ఉపముఖ్యమంత్రి krishna DAS' target='_blank' title='ధర్మాన కృష్ణ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధర్మాన కృష్ణ దాస్ కూడా రాజకీయాల నుంచి బయటికి వెళ్లిపోతున్నారని విస్తృతంగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున వైసీపీ పార్టీ చేపట్టిన ధర్నాలు కృష్ణ దాస్ పార్టీ శ్రేణులతో కలిసి ముందుకి నడిచారు.. దీంతో తమ సోదరులు ఇద్దరు మీద కూడా వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ ఇకమీదట ఎవరూ కూడా ఇలాంటి రూమర్స్ అని నమ్మవద్దండి అంటూ కోరుతున్నారు. రాజకీయాలలో తాము కొనసాగుతామని గట్టిగా చెప్పినట్లుగా తెలుస్తోంది.



రాజకీయాలలో ఉన్నటువంటి వారు ఒకే సిద్ధాంతానికి ఒకే పార్టీకి కట్టుబడి ఉండాలని అప్పుడే వారికి విలువైన గౌరవం కూడా లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంలో ధర్మాన సోదరులు కూడా ఇతర పార్టీలోకి వెల్లబోమంటూ కూడా క్లియర్ గా చెప్పేశారట. ప్రసాద్ రావు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఐదేళ్లపాటు శ్రీకాకుళానికి ఉండి ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా ప్రజలు ఓడించడం జరిగింది. ఎంతో అభివృద్ధి చేసినా కూడా గోరంగా ఓడిపోవడంతో ఆయన తట్టుకోలేక కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నారని సమాచారం. ఇప్పుడిప్పుడే ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి అర్థమవుతుంది. మళ్లీ వైసీపీ పార్టీ వైపే మక్కువ చూపుతున్నట్లుగా సమాచారం. మొత్తానికి పార్టీ మారడం, గుడ్ బై చెప్పడంపై ధర్మాన సోదరులు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: