ఇప్పుడు మళ్లీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఉపాధ్యాయ నియామకాల పోస్టులు ఉంటాయంటూ తెలుపుతున్నారు. అయితే డీఎస్సీ కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఉప కులాలకు కూడా రిజర్వేషన్స్ అందించాలంటూ సుప్రీంకోర్టు అందించినటువంటి ఆదేశాల మేరకు ఈ పోస్టులలో కూడా రిజర్వేషన్స్ ని అమలు చేయాలని డీఎస్సీకి లింకు పెట్టారని అందుకే ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. కానీ ఏపీలో మాత్రం ఇలాంటి సమస్య లేదని చాలామంది మేధావులే తెలియజేస్తున్నారు.
గత వైసిపి హయాంలో కూడా 6 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రయత్నాలు చేసిన.. జాతీయ నూతన విద్యా విధానం మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా డీఎస్సీ పైన ఆంక్షలు విధించారట. ఇవి అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వాలకు కూడా వర్తిస్తాయని అందుకనే తెలంగాణలో కూడా డిఎస్సి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 10 మంది పిల్లలు ఉన్న పాఠశాలలు సింగిల్ ఉపాధ్యాయ పాఠశాలలను కేంద్రం రద్దు చేసిందట.దీంతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోయిందట.. అందుకే నాడు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సమాచారం. మరి ఈ విషయం పైన సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడుతారేమో చూడాలి.