అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న లొసుగులు, పరిపాలనలో ఉన్న వ్యూహాలు తనకు తెలీవంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల కామెంట్లు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2001లో పొలిటికల్ ఫిలాసఫీతో పాటు ప్రజల పరిపాలన ఎలా ఉండాలనే దానిపై అవగాహన పెంచుకోవడానికి నేను కొన్ని బుక్స్ చదివాను అని ఈ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ అనేది బాగా అర్థం చేసుకోవాలని ఓ పుస్తకం చదివినట్టు కూడా తెలిపారు. ఆ పుస్తకంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల వద్దకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనే ఒక వాక్యం తనకు బాగా నచ్చినట్లుగా పేర్కొన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇలా ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యంగా వస్తోందంటూ, అలా కాకుండా ప్రజల దగ్గరికి ఇవన్నీ వాటంతటవే ఆటోమేటిక్ గా వెళ్ళిపోయేటట్లు చేస్తే ప్రజలకు చాలా మేలు చేసినట్లు ఉంటుందని ఆయన అనుకున్నారట.

 జోక్ ఏంటంటే, ఏపీ మాజీ సీఎం జగన్ ఆల్రెడీ పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొచ్చారు. వాలంటీర్ల రూపంలో ఉప్పు, పప్పు, బియ్యం నుంచి అన్ని సేవలను ప్రజల ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ కూడా తనకి అదే కావాలని కోరుకుంటున్నట్టు ఇప్పుడు చెప్తున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థని ఆపింది ఎవరు? పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు టీమే కదా? ఇప్పుడు పవన్ ఏమంటున్నారు.. ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వరస్ట్ గా మారిందని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యోగులు పని చేయారని చెప్పే జగన్ సచివాలయం అంటూ కొత్త వ్యవస్థలను తీసుకొచ్చారు.

చాలామంది వాలంటీర్లను హైర్‌ చేసుకుని ప్రజలకు సేవలు అందించారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి మళ్ళీ ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకెళ్లాలని అనడం తెలివి తక్కువ పని కాదా అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి లాజిక్ మిస్ అయిన మీరు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించినట్లే అని ఎద్దేవా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ కి అంత తెలివే ఉంటే చదువుల్లో ఎందుకు ఫెయిలవుతాడు అని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అబ్బా అంటూ ఆట పట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: