గత కొంతకాలంగా ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో 2025 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమలులోకి రానుందని రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అభివృద్ధి ఆధారంగా కొన్నిచోట్ల సగటున 15 నుంచి 20 శాతం పెంపు ఉండబోతుందని ఆయన వెల్లడించగా మరి కొన్నికోట్ల మాత్రం ఇప్పుడున్న విలువనే కొనసాగించనున్నారని తెలుస్తోంది.
 
వైసీపీ పాలనలో కొన్నిచోట్ల అడ్డగోలుగా పెంచిన విలువలను ఇప్పుడు తగ్గించామని మంత్రి తెలిపారు. జిల్లా కమిటీలు పేర్కొన్న కొత్త విలువల విషయంలో మరోసారి సమీక్షించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. జనవరి 15 నాటికి తుది ప్రతిపాదనల గురించి ఉన్నత స్థాయిలో చర్చించి ఖరారు చేస్తామని మంత్రి వెల్లడించడం గమనార్హం.
 
వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణకు శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదని నరసరావుపేటలో ఎకరం భూమి విలువ కోటి రూపాయలు ఉన్నట్టు విలువ పెంచారని మా ప్రభుత్వం దాన్ని 20 లక్షల రూపాయలకు తగ్గిస్తోందని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అసంబద్ధంగా జరిగిన విలువల మార్పులను శాస్త్రీయ కొణంలో సవరిస్తున్నామని చెప్పుకొచ్చారు.
 
ఈ విషయంలో జీపీఎస్ విధానాన్ని అనుసరిస్తున్నామని కామెంట్లు చేశారు. సవరించిన కొత్త విలువల ప్రతిపాదనల విషయంలో రియల్ ఎస్టేట్ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను, వినతులను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. రాబోయే మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రజలు భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రం ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది.







మరింత సమాచారం తెలుసుకోండి: