తెలంగాణ ప్రస్తుత ముఖ్య మంత్రి అయినటు వంటి రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి పదవి ని చేపట్టి ఇప్పటికే సంవత్సర కాలం ముగిసింది . 2023 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి . ఇక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ సీట్లను సాధించింది . దానితో ఈ గెలుపులో కీలక పాత్రను పోషించిన రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది . దానితో ఈయన కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టాడు. ఇక ఈయన 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పటికే ఈయన అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగిసింది.

సంవత్సర కాలంలో ఈయన కొన్ని విషయాలలో ప్రజల నుండి అద్భుతమైన పాజిటివ్ ను అందుకుంటే , కొన్ని విషయాలలో నెగిటివ్ ను కూడా అందుకోవాల్సి వచ్చింది. ఇకపోతే 2025 వ సంవత్సరం ఈయన ముందు అనేక లక్ష్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తగా నాలుగు పథకాలను అమలు చేయబోతున్నట్లు వాటి ద్వారా ఈయన మైలేజ్ అద్భుతంగా పెరగబోతున్నట్లు తెలుస్తోంది. దానితో 2025 వ సంవత్సరం ప్రారంభం లోనే రేవంత్ పై మరియు అలాగే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో ఫుల్ పాజిటివ్ పెరగబోతున్నట్లు తెలుస్తోంది. మరి 2025వ సంవత్సరం సంక్రాంతి పండుగ రావడానికి ఇంకెన్నో రోజులు లేదు.

దానితో రేవంత్ తెలంగాణ ప్రజలకు ఎలాంటి పథకాలను ముందుకు తీసుకువస్తాడా ..? అని తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఆ పథకాలు కనుక అద్భుతంగా ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి క్రేజ్ తెలంగాణ రాష్ట్రం లో అద్భుతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా జనాల్లో నమ్మకం మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: