దేశంలోనే అత్యంత పిన్న వయసు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఎట్టకేలకు ఓ ఇంటి వారు కాబోతున్నారు. బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గంలో నుంచి రెండోసారి గెలిచిన ఆయన చెన్నైకు చెందిన ప్రముఖ గాయని ... శాస్త్రీయ సంగీతం మరియు భరతనాట్య కళాకారుని అయిన శివశ్రీ స్కంధ‌ ప్రసాద్ ను వివాహం చేసుకో నున్నారు. ఈ విషయాన్ని బెంగుళూరు లో ఆయనే స్వ‌యం గా మంగళవారం ప్రకటించారు. మార్చి 24న ముహూర్తం నిర్ణయించినట్టు కూడా స్వయంగా వెల్లడించారు. ఇక శివ‌స్క్రీ స్కంధ విషయానికొస్తే మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఆమె భర్త నాట్యంలో ఎంఏ పూర్తి చేశారు .. అలాగే మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. ఇక తేజస్వి సూర్య విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉండే వారు.


సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ లో కీలకంగా వ్యవహరించేవారు. అనూహ్యంగా అతి చిన్న వయసులోనే 2019 లోక్సభ ఎన్నికలలో సదానంద గౌడ ప్రాథినిత్యం వ‌హించిన బెంగ‌ళూరు ద‌క్షిణ పార్లమెంటు స్థానాన్ని కొత్త వాళ్లకు ఇవ్వాలని బిజెపి కేంద్ర నాయకత్వం భావించింది. ఈ క్రమంలోని యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఎవరు ఊహించని విధంగా తేజస్వి సూర్య కు బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గ స్థానాన్ని కేటాయించింది. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తేజ స్వీ సూర్య ఘనవిజయం సాధించి చాలా చిన్న వయసులోనే ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. ఐదేళ్లపాటు ఎంపీగా ఎలాంటి మరక లు లేకుండా తనదైన ముద్రవేశారు. మొన్నటి ఎన్నికలలో మరోసారి బిజెపి జాతీయ నాయకత్వం ఆయనకే సీటు ఇవ్వగా రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారు. ఇక తేజ‌స్వి ఓ ఇంటి వాడు అవుతుండ డంతో ప‌లువురు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు ముందుగానే చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: