ఇలాంటి సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని వరాలు ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారట. రెండు డిఏలు పెంచడానికి రేపటి రోజున మంత్రివర్గ సమావేశంలో వీటిపైన చర్చించుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. DA లను ప్రకటిస్తూ సంక్రాంతికి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాలని పట్టుదలతో ఉన్నారట. PRC,IR ల పై కూడా చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
నెలకు రెండు సార్లు ఏపీ మంత్రివర్గ సమావేశం కూడా జరపాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రేపటి ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్ లో ఏపీ మంత్రిమండలి సమావేశం జరగబోతోందట. అందుకు సంబంధించి ఈ నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి సంక్రాంతికి ఆనందపరుస్తారో చూడాలి మరి.. వీటితో పాటుగా వచ్చే ఏడాది పథకాలను సైతం అమలు చేయడానికి మంత్రివర్గ సమావేశంలో కూడా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలను ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తొంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల అపోజిషన్ పార్టీ వాళ్లు వీటిమీద ధర్నాలు చేస్తున్నారు. ఇవే కాకుండా రోడ్లు సరిగా లేకపోవడం వల్ల కూడా నానా హంగామా చేస్తున్నారు. మరి సీఎం చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.