ఎవరైనా మంత్రి పదవి కోసం కొన్ని సంవత్సరాలుగా కలలు కంటూ ఉంటారు .. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. ఐదు నుంచి ఆరు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి సైతం మంత్రి పదవి రాదు .. తమ జీవితంలో ఒక్కసారి అయినా అమాత్యా అని అనిపించుకోవాలని వారు ఎంతో ఆశతో ఆరాటపడుతూ ఉంటారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటి వరకు ఆయన మంత్రి కాలేకపోయారు. కొందరికి అనూహ్యంగా తొలిసారి గెలిచిన వెంటనే మంత్రి పదవి వచ్చేస్తుంది. రామచంద్రాపురం నుంచి గెలిచిన వాసంశెట్టి శుభాష్ తొలి ప్రయత్నం లోనే అనుకోకుండా మంత్రి అయిపోయారు. ఎవరైనా మంత్రి పదవి కావాలని కోరుకుంటారు. .. కానీ ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే మాత్రం మంత్రి పదవి వద్దు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. మంత్రివర్గంలో ఎప్పుడు మార్పులు జరిగినా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయం మన ప్రచారం సాగుతోంది.
అయితే మంత్రి పదవిపై పల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. తనకు మంత్రి పదవి కంటే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి మిన్న అని ఆయన కామెంట్ చేశారు .. తాను ఏ పదవిలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నానని ... ఈ పదవి తనకు ఎంతో విలువైనది అని పల్లా శ్రీనివాస్ చెప్పారు. బాబు మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రులను తొలగించడం .. కొత్తవారిని చేర్చుకోవడం అంటూ వస్తున్న వార్తల పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ మంత్రులుగా ఉన్న వారిని తీసివేయాలి అంటే వారు అసమర్థులు అయినా ... అవినీతిపరులు అయినా అయి ఉండాలని బాబు క్యాబినెట్లో అంతా బాగా పనిచేస్తున్నారు. కాబట్టి తొలగింపు అన్నది ఉండదని ఆయన చెప్పారు.
అయితే క్యాబినెట్ లో ఉన్న ఒక ఖాళీ ని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేసి అంతటితో సరిపెడతారా ? అని కూటమి నేతలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. పల్లా మాత్రం ఇప్పుడున్న మంత్రులలో ఎవరు ?అవుట్ కారని చెబుతున్నారు. ఇక మార్చిలో ఏర్పడే ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చని అంటున్నారు.