జగన్‌పై ఆపార్టీ నేతలు పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయన తీరేంటో తెలిసొస్తోంది. ఇంకా వైఎస్సార్సీపీలో ఉంటే జనంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయంతో నేతలు ఆ పార్టీకి దూరం జరుగుతున్నారు.ఈ క్రమంలో మనల్ని నమ్ముకున్న వాళ్లే ముఖ్యం అన్నటువంటి ఫార్ములా నుంచి గెలిచిన తరువాత జగన్మోహన్ రెడ్డి  కుల సమీకరణాల్లోకి వెళ్లి తిన్న దెబ్బ, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. బయటనుంచి వచ్చినోళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చి, పార్టీ ని నమ్ముకున్నోళ్ళని పక్కన పెట్టిన కారణం గా కార్యకర్తలు దూరమాయ్యారు, నాయకులు దూరమయ్యారు. జగన్ కి బుద్ధిచెప్పాలని ఎవరికీ వాళ్ళు సైలెంట్ అవ్వటమే ఇవాళ 11స్థానాలకు పరిమితమైనటువంటి ఫలితం. ఇప్పుడు జగన్ దానిని సరిచేసే ప్రయత్నం చేస్తుండటం తో ఒక 20%, 30% మాత్రమే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఇంకా చాలా వుంది. ఆయన కాంఫిడెన్స్ ముందు తన సొంత పార్టీ లో కల్పించడానికి, మెయిన్ సమస్య ఏంటంటే అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్,తరువాత రోశయ్య, అళ్లనాని ఎటువంటి వాళ్ళు కి మనం చెప్పుకుందాం అసలు ఏం పదవులు తగ్గినాయి, ఏ స్ట్రెచర్ ఇచ్చారు వాళ్లకు. కానీ వాళ్లెవ్వరికి జగన్ మీద ప్రేమలేదు.

ఆ పదవి మీద, మరియు జగన్ మోహన్ రెడ్డి ఏమైనా వాళ్ళు పార్టీ లో రావటం కోసం డబ్బులేమైన తీసుకున్నారెమో, అందుకే వాళ్ళు డబ్బులిచ్చి వచ్చాము, డబ్బులతో పని అయిపోయింది కాబట్టి వెళ్లిపోయారేమో అనేది ఒక వంతు అయితే, ఇప్పుడు తాజాగా బయటనుంచి వచ్చినటువంటి వారికీ పోస్టులు ఇచ్చినటువంటి సందర్భం కావచ్చు.వారిలోఒకసారి చెప్పుకుంటే గంజి చిరంజీవి ఆయన వల్ల పార్టీ కి వరిగింది ఏమిలేదు.అలాగే మంగళగిరి లో ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిచినా కూడా, అది లోకేష్ మీద గెలిచినటువంటి అతనిని కాదని గంజి చిరంజీవి కి ఇవ్వడం వల్ల అక్కడ దెబ్బ తిన్న పరిస్థితి.ఇక ఇంకో కోణంలో కైకలూరు లాంటి చోట ఎవరైతే పార్టీ ని నమ్ముకున్నారో వారిని పక్కనపెట్టిన జయమంగళం లాంటి వారికీ ఇస్తే ఆయన వెళ్లి జనసేన లో చేరారు.ఈ క్రమంలో ఇవన్నీ చూసిన తరువాత మొదట పార్టీ ని నమ్ముకున్నవాళ్లకె ప్రయారీటి ఇవ్వాలి అన్నటువంటి మాట జగన్ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వుంది.మరి జగన్ ఏదైనా నేర్చుకుంటారా, లేదా ఇలాంటి అనుభవం గుణపాఠం అవుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: