సినీ సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువమంది పొలిటికల్ పరంగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మాధవి లత కూడా ఒకరు. అయితే ఈమె ఎక్కువగా వివాదాలలో ఈ మధ్యకాలంలో నిలుస్తూనే ఉంది. ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా వాటిపైన స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఉండడం వల్ల ఈమె అన్ని విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈమె ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదేమిటంటే .. తాడిపత్రిలోని మహిళలకు సూచనలు ఇస్తూ జేసి పార్కుకి మహిళలు దయచేసి వెళ్ళవద్దని అక్కడికి వెళ్లడం మహిళలకు సేఫ్ కాదంటూ ఒక వీడియోని తెలిపిందట.


అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. పెన్నా నది ఒడ్డున ఈ జెసి పార్క్ వద్ద చాలామంది గంజాయి తాగుతున్నారన్నట్టుగా తెలుపుతోంది. మీరు రాత్రిపూట న్యూ ఇయర్ చేసుకున్న తర్వాత వెళ్లే వేయికల్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటారని తెలుపుతోంది. మీకు సెక్యూరిటీ ఏరియాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే తప్పు పట్టే దాన్ని కాదంటూ తెలిపింది. మత్తులో మహిళల మీద ఏమైనా చేస్తారు అంటూ ఒక సంచలన వీడియోని తెలియజేసింది ఈ విషయం మీద జేసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

న్యూ ఇయర్ వేల పట్టణ ప్రజలకు అవమానించేలా మాట్లాడించారని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.. జెసి పార్కు సురక్షితం కాదని ఎవరు వెళ్లకండి అంటూ అక్కడ గంజాయి కొడతారు తాగుతారు అంటూ ఆమెతో తప్పుడు ప్రచారం చేయించారంటూ ఫైర్ కావడం జరిగింది. దీంతో మాధవి లతపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఈమెతో పాటు మరొక మహిళను కూడా ఉద్దేశించి బతుకుతెరువు కోసం ఇలా పార్టీలు మారే వారితో మాట్లాడిస్తారా అంటూ కూడా ఫైర్ కావడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: