గత కొంతకాలంగా కూటమి నేతలలో ఏదో ఒక సందర్భాలలో అసహనం అనేది బయటపడుతూ ఉన్నది.. ముఖ్యంగా రాయలసీమలోని జెసి ప్రభాకర్ రెడ్డి చేసేటువంటి వాక్యాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ బీజేపీ మహిళా నేతగా పేరుపొందిన మాధవి లతా పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ముఖ్యంగా తాడిపత్రిలో జెసి పార్కులో జరిగే అఘాయిత్యాల గురించి మాధవి లత తన సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు తెలియజేయడంతో ఆమె పైన ఫైర్ ఇవ్వడం జరిగింది.



అయితే ఈ వ్యాఖ్యల పైన ధర్మవరం ఎమ్మెల్యే మినిస్టర్ సత్యకుమార్ మాట్లాడడం జరిగింది.. ముఖ్యంగా నటి బిజెపి నేత మాధవి లతా పైన టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను సత్యకుమార్ ఖండించడం జరిగింది.. జెసి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని ఆయన కేవలం వ్యాపారాల పైన ఎన్నో ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూటమిలో ఉన్న బిజెపి పైన ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అంటూ తెలియజేశారు మాధవిలతాకు ఎలాంటి గొప్ప పేరు లేదు కానీ ఒక ప్రాస్టిట్యూట్ అనే చేసి ప్రభాకర్ రెడ్డి తెలియజేయడంపై మంత్రి సత్యకుమార్ ఖండించారు.


మొత్తానికి ఒక హీరోయిన్ వల్ల కూటమిలోని ఈ నేతలు ఇద్దరు కూడా మాటల యుద్ధం మొదలవుతోంది. ఇప్పటికే ఈ విషయం పైన మాధవి లత కూడా స్పందించడం జరిగింది.. ఆ వయసు అయిపోయిన మనిషి మాట్లాడిన మాటలకు ఒక గొప్ప ధన్యవాదాలు అని.. ఆయనకి సపోర్టివ్ గా చేస్తున్న వారందరికీ సంతాపం అంటూ తెలిపింది. అలాగే తనను చంపాలనుకుంటే చంపొచ్చు అని మహిళల మానప్రాణాల విషయంలో తాను మాత్రం ఒక అడుగు కూడా వెనక్కి వేయనని ఒంటరిగా ఆయన పోరాడుతానని తెలియజేశారు. సినిమాలలో ఉండే వారందరూ కూడా ప్రాస్టిట్యూటర్లే అన్నట్లుగా ఆయన చెప్పారు కాబట్టి వారి జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి రావద్దు అంటూ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: