హిందూ మతాన్ని రక్షించాలంటూ పవన్ చేస్తున్న జెన్యూన్ ఎఫెక్ట్స్ అనేవి అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మరొక సంచలన పిలుపునిచ్చారు. జనసైనికులను తెలుగు సైనికులుగా మార్చే గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు పవన్. రీసెంట్‌గా పుస్తక మహోత్సవం సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలుగు భాషతో పాటు తెలుగు సంస్కృతిని కాపాడే బాధ్యతను జన సైనికులు, తన అభిమానులు భుజాలకు ఎత్తుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నిజానికి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల్లో దాదాపు 80 శాతం మంది తెలుగు భాషలోనే మాట్లాడతారు. తెలుగుని బాగా ప్రేమిస్తారు. వీరు వేర్వేరు వృత్తులలో రాణిస్తున్న సరే తెలుగుని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. మాతృభాషను ప్రేమిస్తూనే ఉంటారు. ఆ భాషను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ వారి పిల్లల్ని మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తప్పనిసరి. ఆ ఒక్క కారణంతోనే వారు పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలని కోరుకుంటున్నారు.
జన సైనికులలో 20 నుంచి 30 శాతం మంది మధ్యతరగతి తరగతి ప్రజలు ఉంటారు. వీరు కూడా పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చేర్చుతారు. కానీ వీరు ఇళ్లల్లో తెలుగు భాషను బాగా మాట్లాడుతారు. తెలుగుని ప్రేమిస్తారు, పిల్లలకు కూడా భాష పై ప్రేమ కలిగేలా చేస్తారు తెలుగుని ఎప్పటికీ ద్వేషించరు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరినట్లే అని చెప్పుకోవచ్చు.