తండ్రి బాటలోనే నడుస్తూ, బాబు వారసుడు నారా లోకేష్ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. సభ్యుల కోసం సరికొత్త ప్రయోజనాలు కల్పించారు. స్మార్ట్ కార్డుతో బస్సుల్లో, ఇతర చోట్ల డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు అందించారు. టాబ్ల ద్వారా విస్తృత ప్రచారం చేసి, సభ్యత్వాల సంఖ్యను అనూహ్యంగా పెంచారు. సభ్యత్వం తీసుకుంటే ఇన్ని లాభాలా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికారు. చదువు పూర్తి కాగానే లోకేష్ చూపిన చొరవ, ఆలోచనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇది గతం.
ఇప్పుడు లోకేష్ మరో ముందడుగు వేశారు, సభ్యులందరికీ భీమా కల్పించాలని సంకల్పించారు. కోటి మంది సభ్యులకు భీమా రక్షణ కల్పించాలనేది అతని లక్ష్యం. ఒక సందేశంతో కోటి మందినీ కదిలించగల శక్తి అతనికి ఉంది. కానీ, ఆర్థికంగా అందరికీ సహాయం చేయడం కష్టం కాబట్టి, భీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రైవేట్, ప్రభుత్వ బీమా సంస్థలతో కలిసి వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్', 'యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్' సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక పార్టీ చరిత్రలో ఒకేసారి కోటి మందికి బీమా కల్పించడం ఇదే తొలిసారి. ఈ ఘనతతో లోకేష్ సరికొత్త రికార్డు సృష్టించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, సభ్యులందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.