![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/anchor-shyamala003e626a-29e5-4bf3-b143-d7ee36506a78-415x250.jpg)
అనంతరం నటిగా మారింది. ఈ క్రమంలోనే లయ, గోరింటాకు, అభిషేకం వంటి సీరియల్స్ లో అదిరిపోయే నటనతో తన సత్తాను చాటుకుంది. ఆ తర్వాత యాంకర్ గా మారిన శ్యామల మా ఊరి వంట, పట్టుకుంటే పట్టు చీర వంటి షోలు చేసింది. అలాగే లౌక్యం, ఒక లైలా కోసం వంటి అనేక చిత్రాలలోనూ నటించింది. ఓవైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా తన సత్తాను చాటుకుంది. తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే యాంకర్ శ్యామల నటుడు నరసింహులు ప్రేమ వివాహం చేసుకుంది.
ఇక ప్రస్తుతం వైసీపీ పార్టీలో శ్యామల ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ మీడియాతో వైసిపి అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తానని చెప్పి మోసం చేశాడని శ్యామల అన్నారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు, శుష్క వాగ్దానాలు చేయకూడదని శ్యామల తెలిపారు. సూపర్ సిక్స్ పేరుతో బాండ్ పేపర్లు ఇచ్చి నిలువునా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని శ్యామల ఆగ్రహించారు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని శ్యామల ఫైర్ అవుతున్నారు.
కూటమి నాయకులు, రాష్ట్రంలోని మహిళలు అందరికీ చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని శ్యామల డిమాండ్ చేశారు. జగన్ గారి ప్రభుత్వం 44.48 లక్షల తల్లులకు అమ్మ ఒడి పథకాలను అమలు చేశారని శ్యామల అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మొత్తం వాటి అన్నింటిని ఆపేసారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహించారు.