ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీ చూస్తే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు మరి కొంతమంది సమర్థిస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్షలు చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తూ ఉండగా మరి కొంతమంది మాత్రం అలాంటివి ఏమీ లేవు అంటూ ఆయనను సమర్థిస్తూ ఉంటారు. చంద్రబాబు ఎక్కువగా డెవలప్ గురించి ఆలోచిస్తూ ఉంటారని విధంగా కొంతమంది నేతలు తెలియజేస్తూ ఉంటారు. అందుకే సీఎం చంద్రబాబు పద్ధతి ఒక ప్లాన్ ప్రకారము కొనసాగుతూ ఉంటుందని చాలామంది వెల్లడిస్తూ ఉంటారు.


కానీ చంద్రబాబు ఇప్పటికే నాలుగు సార్లు సీఎం గా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేయలేదట.. 2014 నుంచి 19 వరకు బాబు వైసీపీ నుంచి వచ్చేవారిని స్వాగతం పలికారు ఇది రాజకీయ వ్యూహంలో భాగమే అయినా ఇది చివరికి టిడిపి పార్టీని ఇబ్బందులలోకి గురిచేసింది. ఇప్పుడు కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు బాగానే ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.


కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల పాలనలలో వైసీపీ నేతలు మీద చాలా కేసులు పెడుతున్నారని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారందరి మీద కేసులు పెడుతున్నారు అనే విధంగా వార్తలు వినిపించాయి. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం ఏదో ఒక కేసులో కనిపిస్తూ ఉన్నారు.పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హోమ్ శాఖ విషయం పైన చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారి మీద అందరి మీద కేసులు పెట్టారని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ విషయంలో ఎలాంటి చిన్న ఆ ఒక తవ్వకాలు  జరిగిన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి మరి నాన్న రచ్చ చేస్తున్నారు.


ఇటీవల కడపలో ఎంపీడీవో మీద వైసిపి నేతలు దాడి చేశారని విషయం తెలియగానే.. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి మరీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్ కి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ భూములు ఉన్నాయంటూ నానా రచ్చ చేశారు. అలాగే వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణల మీద సీరియస్ గానే పవన్ కళ్యాణ్ వ్యవహరించారట. ఇవన్నీ చూస్తూ ఉంటే అటు చంద్రబాబుకు కూడా పవన్ కళ్యాణ్ తో ఇబ్బందులు కనిపిస్తున్నాయట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తూ ఉన్నది. కనుక రాబోయే రోజుల్లో కూటమి మొత్తం పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతుందనే విధంగా జనసేన కార్యకర్తలు కూడా తెలుపుతున్నారు. మరి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోనే ట్రబుల్ మొదలవుతుందో లేదో చూడాలి. అయితే కూటమి ప్రభుత్వం చెబుతోంది వేరు గ్రౌండ్ లెవెల్ రియాల్టీ ప్రజలలో మరొక రకంగా ఉన్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: