ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య  సంబంధాలు.. చాలా పాజిటివ్గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఆ పార్టీ నుంచి కీలక పదవులను కూడా రేవంత్ రెడ్డి.. అనుభవించడం జరిగింది. దీంతో చంద్రబాబు గురువుగా.. రేవంత్ రెడ్డి శిష్యుడుగా.. పేరు పొందారు. ప్రస్తుతం ఈ ఇద్దరు లీడర్లు ముఖ్యమంత్రిలు వేరువేరు పార్టీల ద్వారా అయినప్పటికీ... వారిద్దరిని గురువు అలాగే శిష్యులుగా... అందరూ ప్రస్తావిస్తారు.


అయితే అలాంటి ఇద్దరు లీడర్ల మధ్య కొత్త చిచ్చు వచ్చింది. చంద్రబాబు నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు పైన సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్లకు లేఖ రాయాలని ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో గోదావరి - బనకచర్ల  అనుసంధానాన్ని చేపడుతుంది చంద్రబాబు నాయుడు సర్కార్.


అయితే గోదావరి బనకచర్ల అనుసంధానం పైన... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల తెలంగాణ నష్టపోయే ప్రమాదం ఉందని... అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం... అలర్ట్ అయింది.  ఏపీ సర్కార్ చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధానం పైన... వెంటనే రిపోర్ట్ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు  ఆదేశాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి కేటాయింపులు లేకుండానే ఈ అనుసంధానం చేపడుతున్నట్లు... అధికారం చెప్పడంతో... ఏపీ ప్రభుత్వం పై సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి.


దీనిపై వెంటనే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవసరమైతే ఈ విషయాన్ని.... కేంద్ర జల శక్తి శాఖ,  గోదావరి నది యాజమాన్య బోర్డు వద్దకు తీసుకువెళ్లాలని... నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణ అలాగే భద్రాచలం ఆలయం పై... ఎంత ఉంటుందని దానిపైన కూడా అధ్యయనం చేయనుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మరి దీనిపై చంద్రబాబు నాయుడు సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: